నన్ను పిలచిన నజరేయుడా ఏనాడైనా మరువా లేదయ్యా "2"
కొదువేమీ లేదయ్యా నాతో నీవుండగా ... "2" "నన్ను పిలచిన"
1. నా ముందు వెలుగునీవే నా వెనుక కావలి నీవే నా పైన మేఘము నీవే నా యేసయ్య..."2"
నా ముందు నడిచి నాతో
తోడుగా ఉన్నవాడా.."2"
బండనుండి నీళ్లను ఇచ్చిన బలవంతుడ నీవయ్యా.."2"
భయమేమి లేదయ్యా నాతో నీవుండగా..."2" "నన్ను పిలచిన"
2. మౌనములో గానం నీవే దుఃఖములో ఓదార్పు నీవే
ఒంటరిలో తోడు నీవే
నా యేసయ్య.."2"
అన్ని వేల అండదండ
కన్నతండ్రి నీవేనయ్యా "2"
కష్టాలన్నీ దీవెనగా మార్చువాడవు నీవయ్యా.."2"
దిగులేమి లేదయ్యా నాతో నీవుండగా.."2" "నన్ను పిలచిన"
3. నోటిలోన పాటవు నీవే
గొంతులోన రాగం నీవే హృదయములో ధ్యానము నీవే నా యేసయ్య.. "2"
మధురమైన సంగీతం మరుపురాని సందేశం "2"
అన్ని వేల ఆనందం అభిషేకం నీవయ్య "2"
చింతేమి లేదయ్యా నాతో నివుండగా .. "2" నన్నుపిలచిన "

0 Comments