Search This Blog

Aadharam neeve Yessaya song lyrics

 ఆధారం నీవే యేసయ్యా

నా దాగు చోటువు నీవే నీవే (2)

హల్లేలూయా హల్లేలూయా 

హల్లేలూయా హల్లేలూయా (2)

ఆధారం నీవే యేసయ్యా

నా దాగు చోటువు నీవే నీవే 


1.సింహల బోనులో నా బలము నీవే

అగ్ని గుండములో నా తోడు నీవే (2)

నీ పర్ణ శాలలో నన్ను దాచినావు (2)

ఆశ్రయ దుర్గము నీవే నీవే (2)

ఆధారం నీవే యేసయ్యా

నా దాగు చోటువు నీవే నీవే (2)


2.కునుకాక కృప చూపు దేవుడవు నీవే

శ్రీమంతుడవు నీవే సర్వాధికారి (2)

జిగట మన్ను మేము కుమ్మరివి నీవే (2)

అల్ఫా ఓమేగాయు నీవే నీవే (2)

ఆధారం నీవే యేసయ్యా

నా దాగు చోటువు నీవే నీవే (2)


3.గొప్ప దేవుడవు యుద్ధ శూరుడవు

స్వస్థపరచు సర్వశక్తిమంతుడవు (2)

మారాను మధురము చేసినా దేవా (2)

నా జీవ ఊటవు నీవే నీవే (2)

ఆధారం నీవే యేసయ్యా

నా దాగు చోటువు నీవే నీవే (2)

Post a Comment

0 Comments

Join In Telegram