కునుకని నిదురించని మా నాన్నవే నీవయా
అమ్మవలె నన్ను ఆదరించువాడా
మా నాన్నవలె నాపై జాలిచూపువాడా
ఆలనా పాలనా ఇక నీవెగా నా యేసయా “2”
II కునుకని II
చరణము: భుజముపైన నన్ను మోయుచున్న వాడా
జోలపాట పాడి లాలించువాడ “2”
అమ్మగా నాన్నగా ప్రేమించిన నాయేసయా “2”
II కునుకని II
చరణము: అలసిపోయిన వేళ లేవనెత్తువాడ
సొమ్మసిల్లు వేళ బలపరచువాడ “2”
అండగా నీవుండగా భయమేలనో నాయేసయా “2”
II కునుకని II
చరణము: ఎవరు నన్ను విడచిన విడిచిపోని వాడా
తల్లి నన్ను మరచిన మరచిపోనివాడ “2”
ఒడిలో నన్ను దాచినా నా ప్రియుడవే నీవయా “2”
II కునుకని II
0 Comments