Search This Blog

#Prayer and Bible reading#వాక్యము చదువుట, ప్రార్థన చేయుట

 ✳ *వాక్యము, ప్రార్థన అంటే ఏమిటి?...✍*


👉క్రైస్తవునికిి వాక్యము చదువుట, ప్రార్థించుట అనేవి చాలా ప్రాముఖ్యమైన విషయములు.


*బండికి రెండు చక్రాలు ఎంత అవసరమో,* క్రైస్తవునికిి కూడా 

🔺 *వాక్యధ్యానము,*

🔺 *ప్రార్థనా జీవితము* అంతే అవసరం.


*వాక్యము ప్రభువును పరిచయం చేస్తే ,* 

👉ప్రార్థన ఆయన శక్తిని తెలియజేస్తుంది.


*వాక్యము దేవుని ప్రేమను తెలియజేస్తే,*

👉ప్రార్థన ఆయనతో అద్భుతాన్ని చేయిస్తుంది.


*వాక్యము పరలోకం గురించి తెలియజేస్తే,*

👉ప్రార్థన పరలోకాన్ని సైతం కదిలించి వేస్తుంది.


👉వాక్యము నీకు ఆదరణ కలిగిస్తే,

*ప్రార్థన ఆశ్చర్య కార్యాలను చేయిస్తుంది.*


👉వాక్యము జీవితాన్ని వెలిగిస్తే,

*ప్రార్ధన ఆ వెలుగులో నడిచేలా వేస్తుంది.*


👉వాక్యము పాపం అంటే ఏమిటో నీకు తెలియజేస్తే,

*ప్రార్థన పాపం చేయకుండా సహాయం చేస్తుంది.*


👉వాక్యము ఏ మార్గంలో ప్రయాణించాలో తెలియజేస్తే,

*ప్రార్థన ఆ మార్గంలో నిన్ను నడిపిస్తుంది.*


👉వాక్యము నిన్ను దేవునికి దగ్గర చేస్తే,

*ప్రార్థన ఆయన నీతో ఉండేలా చేస్తుంది*


👉ప్రభువు వాక్యం ద్వారా నీతో మాట్లాడితే,

*ప్రార్థన ద్వారా నీ అంతరంగాన్ని తెలుసుకుంటాడు.*


👉దేవుని వాక్యం మనకు కవచం అయితే,

*ప్రార్థన మనకు ఆయుధం.*


🔺కాబట్టి,

*మనలను సృష్టించిన దేవునికి కళ్లు ఉన్నాయి..* 

*చెవులు ఉన్నాయి..* 

👉కనుక మనం వాక్యం చదవడం చూస్తారు. 


👉మనం చేసే ప్రార్థనను వింటారు. ఆ ప్రార్థనకు జవాబును కూడా ఇస్తారు...


*" క్రైస్తవునికి వాక్యధ్యానము, ప్రార్థనా జీవితమే అసలుసిసలైన గీటురాయి.*


👉నీళ్లలోనికి దిగకుండా ఎలా అయితే ఈత నేర్చుకోలేమో, అదేవిధంగా వాక్యం చదవకుండా నిజదేవుడైన యేసుక్రీస్తు ను కూడ మనం తెలుసుకోలేము.


*పరుగు పందెంలో పరుగెత్తకుండా ఎలా అయితే గమ్యాన్ని చేరలేమో,అదేవిధంగా ఆత్మీయ పోరాటం లో ప్రార్థించకుండా దేవుని శక్తిని తెలుసుకోలేము."*


కాబట్టి,


*" ఇకనైన మనస్సు మార్చుకుందాం.....*

👉 ప్రతిరోజు వాక్యము చదవడం, 

👉ప్రార్థన చేయడం అలవాటు చేసుకుందాం....


ఎందుకంటే,

*" వాక్యమే మన శక్తి... ప్రార్థనే మనబలం...*


*వాక్యమే మన ప్రమాణికం... ప్రార్థనే మన ఆత్మీయ పోరాటం."*


*" వాక్యమే మన మార్గం...*


 *ప్రార్థనే మన గమనం.....*


 *పరలోకమే మన గమ్యం...."*


ఈ కొద్ది మాటలు చదివిన మిమ్మల్ని దేవుడు దీవించును గాక... .ఆమెన్ .

Post a Comment

0 Comments

Join In Telegram