నా పక్షమై నిలిచినావు-నా అండ నీవని స్తుతియిం తును(2)
నా అతిశయమా - నా ఐశ్వర్యామా
నా ఆనంద తైలము నీవే యేసయ్యా (2)
1.నా ఇంటి దీపమై నీవు
కాచావు నన్ను నీ కంటి పాపలా (2)
నీ దయారసమును నాపై పోసి
దరిచేరనియలేదు ఏకీడునాకు (2) నా పక్షమై
2. ప్రేమానుబంధం మనది
విడదీయలేవులే ఏ శ్రమలైనా(2)
నా ఆత్మ బంధువు నీవెనయ్య
హత్తుకోనేదను నిన్నే యేసయ్య (2)
3.నా హృదయాభిలాషవు నీవు
నిలువెల్లా నాలో కొలువైన ప్రియుడా(2)
నీ ప్రేమామృతము నాలో నింపి
మలచావు నన్ను నీ మహిమ పాత్రగా(2)
0 Comments