పల్లవి:👨🎤👩🎤
{ఎందుకింక కన్నీరు ఎందుకావేదన
నీ దుఖఃదినములన్ని సమాప్తమైనవని
తెలుసుకో నేస్తమా యేసయ్య మాటిది } [2]
చరణం:1️⃣
{పరలోక మహిమను నీ కొరకు విడిచెను
తన ప్రాణం పెట్టి నిన్ను బ్రతికించెను } [2]
{ఇంత చేసినవాడు నీకు దురమౌతాడా
{సందేహమును వీడి
సిలువ దర్శనము పొంది } [1]
{బ్రతికితే క్రీస్తు కొరకు
చావైతే లాభమనుకో } [2]
{ప్రాణమా నాలో తొందర పడకుమా } [2]
|ఎందుకింక|
చరణం:2️⃣
{మన్ను అడ్డు ఉందని మొలకెత్తకుందువా
రాళ్ళు రువ్వుతారని భరించకుందువా } [2]
{ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలె
పెరిగెను యేసయ్య ద్రాక్షవల్లిగా } [1]
{అంటు కట్టబడి నీవు
బహుగా ఫలించుమా } [2]
{ప్రాణమా నాలో తొందర పడకుమా } [2]
|ఎందుకింక|
చరణం:3️⃣
{అపజయముల మధ్య
వెనుకంజ వేయకుమా
పోరాడుచున్నది అంధకార శక్తులతో } [2]
{దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకుని
ధూపర్తి చేబూని స్తుతి యాగము చేయుచు } [1]
{జయమే ఊపిరిగా గురియొద్ధకే సాగిపో } [2]
{ప్రాణమా నాలో తొందర పడకుమా } [2]
|ఎందుకింక|
0 Comments