Search This Blog

Search This Blog

సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా Song Lyrics 🎵


 పల్లవి:👨‍🎤👩‍🎤

{సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో

నీ ప్రేమ గీతం పాడెదా 

నీ గోప్ప కార్యం చాటెదా 

నా జీవితం మార్చిన యేసయ్యా...

ఈ నీ రుణం తీర్చుట ఏటులయ్యా... } [1]

                                |సంగీత|


చరణం:1️⃣

{నా కఠిన హృదయమున

కారుణ్యమును నింపి

కలువలు పూయించిన

కృపలను కొనియాడెదా } [2]

{పాపములు క్షమియించి నను మార్చినా

దోషములు భరియించి దరి చేర్చినా } [1]        

                             |నీ ప్రేమ|


చరణం:2️⃣

{నా కష్ట సమయమున

నా చెంతనే నిలచి

విడువక నడిపించిన

విధమును వివరించెదా } [2]

{క్షేమమును కలిగించి నను లేపినా 

దీవెనలు కురిపించి కృప చూపినా } [1]

                            |నీ ప్రేమ|


చరణం:3️⃣

{నా దుఃఖ దినములలో

ఓదార్పు కలిగించి

కన్నీటిని తుడిచిన

క్రమమును ప్రకటించెదా } [2]

{వాక్యముతో దర్శించి బలపరిచినా 

సత్యముతో సంధించి స్థిరపరిచినా } [1]

                             |నీ ప్రేమ|


Post a Comment

0 Comments

Join In Telegram