పల్లవి:👨🎤👩🎤
{ఎడబాయని నీ కృప
నను విడువదు ఎన్నటికీ } [2]
{యేసయ్య నీ ప్రేమానురాగం
నను కాయును అనుక్షణం } [2]
|ఎడబాయని|
చరణం:1️⃣
{శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో
కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో } [2]
{అర్ధమేకాని ఈ జీవితం
ఇక వ్యర్థమని నేననుకొనగ } [2]
{కృపా కనికరముగల దేవా
నా కష్టాలకడలిని దాటించితివి } [2]
|ఎడబాయని|
చరణం:2️⃣
{విశ్వాస పోరాటంలో ఎదురాయె శోధనలు
లోకాశల అలజడిలో సడలితి విశ్వాసములో } [2]
{దుష్టుల క్షేమము నే చూచి
ఇక నీతి వ్యర్థమని అనుకొనగ } [2]
{దీర్ఘశాంతముగల దేవా
నా చేయి విడువక నడిపించితివి } [2]
|ఎడబాయని|
చరణం:3️⃣
{నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో
నా బలమును చూచుకొని నిరాశ చెందితిని } [2]
{భారమైన ఈ సేవను
ఇక చేయలేనని అనుకొనగ } [2]
{ప్రధాన యాజకుడా యేసు
నీ అనుభవాలతో బలపరిచితివి } [2]
|ఎడబాయని|
🎤 🎧
0 Comments