Ninnu stuthinchadaniki siggu padanu yessaya song lyrics #christian songs
ప॥ నిను స్తుతించడానికి సిగ్గుపడను యేసయ్యా
నిను ప్రార్ధించడానికి వెనుకాడను (అలసిపోను) నేనయ్యా
1. నాకున్న స్వరము - నాకున్న కరము
నాకున్న ధనము- నాకున్న స్థలము
నీ పనికోసం ఉపయోగిస్తా పనికోసం ఖర్చైపోతా
నీ కోసం అర్పిస్తానయ్యా
2. నాకున్న టైము - నాకున్న ఫేము నాలోని జోరు
నాలో హుషారు
నీ పనికోసం కేటాయిస్తా పనికోసం పరుగులు తీస్తా
నీ కోసం పనిచేస్తానయ్యా.
3. నాకున్న చదువు - నాకున్న పరువు
నాకున్న పదవి - నాకున్న చెలిమి
నీ పనికోసం ప్రక్కనపెడతా - పనికోసం ప్రాణం పెడతా
నీకోసం జీవిస్తానయ్యా
0 Comments