Search This Blog

Search This Blog

Edabayani ni Krupa song

*దేవుని కృప*ఎడబాయని నీ కృపా నను విడువదు ఎన్నటికి(2) యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనూక్షణం *యెడబాయని నీ కృప* 1️⃣ శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో (2) అర్థము కానీ ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా (2) కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి *ఎడబాయని నీ కృప* 2️⃣ విశ్వాస పోరాటము లో ఎదురాయె శోధనలూ లోకాశల అలజడి లో సడలితి విశ్వాసములో (2) నిశ్చల క్షేమము నే జూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా(2) దీర్ఘశాంతము గల దేవా నా చేయివిడువక నడిపించి *యెడబాయని నీ కృప* 3️⃣ నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితినీరమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా(2 ;ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచి *యెడబాయని నీ కృప* సేకరణ: *శ్రీమతి జె.విమల కుమారి* 🎤🎻🎺🎷🎼🎻🎧🥁🎤 ‌

Post a Comment

0 Comments

Join In Telegram