Good Friday song
పల్లవి:-
ఎంత గొప్ప బొబ్బ పుట్టెను
దానితో రక్షణమంతయును
సమాప్త మాయెను (2)
ఎంత గొప్ప బొబ్బ పుట్టెను
యేసునకు కల్వరి మెట్టను (2)
సంతసముతో సిల్వగొట్టగ
సూర్యుడంధకారమాయెను..(2)
(ఎంత గొప్ప)
చరణం:-+01
పావనుండగు ప్రభువు మనకొరకై
యా సిలువమీద చావునొందెడు
సమయమందున (2)
దేవుడా నా దేవుడా
నన్నేల చెయివిడిచితివి
అనియా....(2)
రావముగ మొఱబెట్టెను
యెహోవయను
దన తండ్రితోను (2)
(ఎంత గొప్ప)
చరణం:-+02
అందు దిమిరము
క్రమ్ము గడియయ్యొ
నా నీతి సూర్యుని
నంత చుట్టెను బంధకంబులు (2)
నిందవాయువు లెన్నో వీచెను
కందు యేసుని యావరించెను (2)
పందెముగ నొక కాటువేసెను
పాత సర్పము
ప్రభువు యేసును..(2)
(ఎంత గొప్ప)
చరణం:-+03
శాంతమాయె నటంచు బలుకుచును
ఆ రక్షకుడు తన స్వంత విలువగు
బ్రాణమును వీడెన్...(2)
ఇంతలో నొక భటుడు
తనదగు నీటెతో ప్రభు
ప్రక్కబొడువగ...(2)
చెంతజేరెడి పాపులను
రక్షించు రక్తపు ధారగారెను..(2)
(ఎంత గొప్ప)

0 Comments