ఏ ఘడియా కానీ నీవు లేకుండా
పల్లవి: ఏ ఘడియా కానీ నీవు లేకుండా
ఈలోకమందు నేనుండలేను
నా ప్రాణ ప్రియుడా యేసు -నా సర్వస్వం నీవేనయా
1.నాలోన ప్రతిరూపమా-నీ ప్రతిబింబము నేనేనయ్యా
నీ కొరకు నిలిచి ప్రకాశించునట్లు -నాలోన వసియించుమా
2. ధన ధాన్య రాసులైనా -ఈ ధరణిలో మేడలైనా తులతూగునట్టి సంపదలెనున్నన్నా -నీకు సమము రామయా (2)
3.నేనెంత కాలమున్నా - నీ కొరకే బ్రతికెదను
నీ సాక్షిగానే జీవించునట్లు -అభిషేకము నాకియ్యిమా
4.నా కన్నులలో దీపమా -నా గొంతులో రాగమా
నా నిదురలోన ఓ చిరుస్వవ్నమా -మనసంతా నీవేనయా
5.ఎవరిని నమ్మాలయ్యా - నమ్మదగినవారు లేరయ్య
కల్వరి నాథా సిలువ ప్రేమతో నన్ను నీవు కొనినావయ్య
0 Comments