నీ చల్లనైన నీడలో నన్ను నివసించనీ ప్రభూ
ప|| నీ చల్లనైన నీడలో నన్ను నివసించనీ ప్రభూ
నీ పరిశుద్ధ పాదములే నను తాకనీ ప్రభూ
నీ ప్రేమా నాలోనా -2
ప్రతి క్షణము అనుభవించనీ
1. మట్టివంటిది నా జీవితము
గాలిపాట్టువంటిది - నా ఆయుషు
పదిలముగా నన్ను పట్టుకొని
మార్చుకొంటివా - నీ పోలికలో
మరణభయమిక లేదంటివే
2.మారవంటిది - నా జీవితము
ఎంతో మధురమైనది నీ వాక్యము
హృదయములో నీ ప్రేమా కుమ్మరించుమా - జుంటి తేనేలా
మధురము మధురము నా జీవితము..ఆహా
3.అల్పమైనది నా జీవితము
ఎంతో ఘనమైనది నీ పిలుపు
నీ సేవలో సాగుటకు
నన్ను నింపుమా - నీ ఆత్మశక్తితో
ఆగక సాగెద - నీ సేవలో నే

0 Comments