Search This Blog

Search This Blog

సీయోను పాటలు సంతోషముగా song lyrics in telugu

       సీయోను పాటలు సంతోషముగా 


సీయోను పాటలు సంతోషముగా 

పాడుచు సీయోను వెళ్ళడము 

1 లోకాన శాశ్వతానందమేమియు 

లేదని చెప్పెను ప్రియుడేసు 

పొందవలె నీ లోకంబునందు 

కొంతకాలమెన్నో శ్రమలు


2. ఐగుప్తును విడచినట్టి మీరు 

అరణ్యవాసులే ఈ ధరలో 

నిత్య నివాసము లేదిలలోను 

నేత్రాలు కానానుపు నిలుపుడి


3. మారాను పోలిన చేదైన స్థలముల 

ద్వారా పోవలసి యున్నానేమి

 నీ రక్షకుండగు యేసే నడుపును

 మారని తనదు మాట నమ్ము


4. ఐగుప్తు ఆశలన్నియు విడిచి 

టంగున యేసుని వెంబడించు

పాడైన కోరహు పాపంబు మాని

 విధేయులై విరాజిల్లుడి

5.ఆనందమయ పరలోకంబు మనది

 అక్కడ నుండి వచ్చునేసు

సీయోను గీతము సంపుగ కలసి

పాడెదము ప్రభు యేసుకే జై 


Post a Comment

0 Comments

Join In Telegram