నీ గాయములే నాకు స్వస్థతను నీచ్చెను
నీవు పొందిన దెబ్బలే నాకు నెమ్మది నిచ్చెను (2)
పాపము మోసుకుపోయే గొర్రెపిల్లా వదకు సిద్ధమైనావా
లోక పాపం మోసుకుపోయే
గొర్రెపిల్లా వధింపబడినవా ( నీ గాయములే )
1.బరువైన సిలువను భుజాన పెట్టిరే
పశువును కొట్టినట్టుగా కొరడాలతో కొట్టిరే (2)
నోరు తెరవకున్నావా ఓ నాన్న
ఒక్క మాట చెప్పకున్నావా నా తండ్రి (2)
( నీ గాయములే )
2. మొఖానా ఉమ్మినా కాళ్ళతో తన్నినా
పిడికిలితో గుద్దినా పడిపడి నవ్వినా (2)
పాపము చేసింది నేనే ఓ నాన్నా
శిక్ష భరించింది నీవే నా తండ్రి
దోషము చేసింది నేనే ఓ నాన్నా
దోషిగా నిలిచింది నీవే నా తండ్రి
(నీ గాయములే )
3. పాపినైనా నన్ను పట్టుకున్నావు
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినావు
దోషినైనా నన్ను చేర్చుకున్నావు
నీ అరచేతిలో దాచుకున్నావు
విసికించినా గాని ఓ నాన్నా
నన్ను విడిచి పెట్టకున్నావు
చీదరించినా గాని ఓ నాన్నా
నన్ను ఆదరించినావు నా తండ్రి
0 Comments