పల్లవి||
రాజా మహారాజా నిన్ను చూడవచ్చానయ్యా
నిన్ను చూశాను నీ నవ్వును చూశాను
ఆ నవ్వులోనా భారమంత మరచిపోయాను (2)
1. పాప భారముతో వచ్చాను
నీ సిలువ దర్శనము చూశాను (2)
కాల్చిన రుధిరమే నా పాపము కడిగెను (2)
నీతిగా నన్ను చేసిన నిన్నే నేను చూశాను(2)
. ' (రాజా )
2.మండుచున్న అగ్ని యొద్దకు వచ్చాను
మధురమైన నీ మాటలు విన్నాను
తొలగేను భయము కలిగెను నిబ్బరం (2)
జయమొంది నీ సేవలో నడచుటకు నిలిపెను (2) ( రాజా )
3.నీ వాక్యధ్యానములో వున్నాను
మెల్లనైన నీ స్వరమే విన్నాను
సిద్ధ పరచుము పరిశుద్ధాత్మలో (2)
ప్రియుడా నీ రాకతో నీముఖమే చూడాలి (2) ( రాజా )
సిద్ధపరచును పరిశుద్ధాత్మలో
0 Comments