పIl పశువుల పాకలో రారాజు పుట్టెనట
పశువుల పాకలో శ్రీ యేసు పుట్టెనట ( 2 )
రారా ఓ సోదరా - రారా ఓ సోదరి ( 2 )
( పశువుల )
1. ఆదిలో ఉన్నవాడు - ఆది అంతమైనాడు ( 2 )
అమరత్వములో నివసించే రాజు -
దాసునిగా వచ్చి నాడు (2)
దీనునిగా పుట్టినాడు
రారా ఓ సోదరా - రారా ఓ సోదరి ( 2 )
( పశువుల )
2 . పరిశుద్ధుడైన వాడు - పాపము లేనివాడు ( 2 )
పరలోకంలో నివసించే రాజు
పరమును విడచినాడు ( 2 )
బాలునిగా పుట్టినాడు.
రారా ఓ సోదరా - రారా ఓ సోదరి ( 2 )
3. మార్గము సత్యము యేసే -
జీవమునైయున్నాడు ( 2 )
సింహసనాసీనుడైన రాజు -
సింహసనం విడిచినాడు ( 2 )
నిన్ను నన్ను కోరినాడు
రారా ఓ సోదరా - రారా ఓ సోదరి ( 2 )
( పశువుల )
0 Comments