నీకే స్తోత్రములు నీకే వందనములు
యేసయ్య నీలా ప్రేమించేవారు ఎవరు (2)
యేసయ్యా నీలా ఆదరించేవారు ఎవరు (2)
1.ఆకలైన వేళలో ఆహారమిచ్చావు
దప్పికైన వేళలో నా దాహం తీర్చావు (2)
యేసయ్యా నీలా పోషించేవారు ఎవరు
యేసయ్యా నీలా కాపాడేవారు ఎవరు (2)
2. నా తల్లి మరచిన నన్ను మరువనన్నావు
నా తండ్రి విడిచిన నన్ను విడువనన్నావు (2)
యేసయ్యా నీలా ధైర్యమిచ్చేవారు ఎవరు
యేసయ్యా నీలా నడిపించేవారు ఎవరు (2)
3.ఈ లోకములోన నేను ఒంటరినైన
పరలోక దూతల నాకు అండనిచ్చావు (2)
యేసయ్యా నీలా తోడువుండేవారు ఎవరు
యేసయ్యా నీలా జీవమిచ్చేవారు ఎవరు (2)
0 Comments