చుక్కా బుట్టింది అమ్మా చుక్కాబుట్టింది
హేరోదు గుండెల్లో గుబులే పుట్టింది
చుక్కా బుట్టింది అయ్యా చుక్కా బుట్టింది
హేరోదు బంట్లో వణుకే బుట్టింది
నాకంటే గొప్పవాడు పుట్టేనని
పుట్టుడే రాజుగా పుట్టేనని (2)
1. గొల్లలకు శుభవచనము అందగా
గొర్రెలను విడిచి పరుగెత్తిరే
రాజులకు రాజనీ మ్రొక్కుచుండిరే
లోక రక్షకుడని కేకలేసిరే (2)
ఇతడే మా కాపరినిరే - మా జీవితాలే ధన్యమనిరే(2)
[ చుక్కా ]
2. చుక్కా జ్ఞానులకు దారి చూపగా
జ్ఞానమంత ప్రక్కబెట్టి సాగిపోయిరే
బంగారు సాంబ్రాణి భోళం ముందు బెట్టిరే
రాజులకు రాజని మ్రొక్కచుండిరే (2)
ఇతడే మా రాజనరే - మా జీవితాలే ధన్యమనిరే (2)
[ చుక్కా ]

0 Comments