రుచి చూచి ఎరిగితినయ్యా
పల్లవి || రుచి చూచి ఎరిగితినయ్యా
ఉత్తముడవని రక్షకా యేసయ్య
మదినిండెను నీ మమతాను రాగాలు
మరువలేనిది జీవము కంటే ఉత్తమ కృప
1.తండ్రి మాట వినక దూరదేశమెల్లిన
ఆస్తినంత అక్రమముగా వ్యర్థమే చేసిన
మనస్సు మార్చుకొని తండ్రి ఇంటికొచ్చిన
దోషము లెంచని నీ క్షమాగుణమును
నేను వర్ణించలేను వివరించలేను
నీ ప్రేమకు వెల కట్టలేను ( రుచి )
2 వ్యభిచారులు పట్టబడినను
ప్రశ్నించక శిక్షించక కరుణ చూపగలవు
చావుగోతి నుండి నీవు తప్పించి
అమ్మా అని పిలచిన నీ ప్రేమ పిలుపును
నేను వర్ణించలేను వివరించలేను
నీ ప్రేమను నే కొలువలేను ( రుచి )
3. నీతిమంతులు ఏడుమార్లు
పడినను సాతానుకు చోటియ్యక లేవనెత్తగలవు మరణము వరకు నన్ను నీ త్రోవలో
ఆదరించి నడిపిన నీ దయా ఓర్పును
నేను వర్ణించలేను వివరించలేను
నీ ఋణమును నే తీర్చలేను ( రుచి )

0 Comments