ఆత్మతో ఆరాధింతును
సత్యముతో ఆరాధింతును (2)
నా యేసు నిన్నే ఆరాధింతును
అన్నివేళల ఆనందింతును (2)
హల్లే హల్లే హల్లేలుయా - నీకే నీకే స్తుతి స్తోత్రం (2)
1. యోహోవా రాఫా నిన్నే ఆరాధింతును
యెహోవా షమ్మా నిన్నే ఆరాధింతును (2)
యెహోవా నిస్సీ నిన్నే ఆరాధింతును
యెహోవా షాలోమ్ నిన్నే ఆరాధింతును (2)
హల్లే హల్లే హల్లేలుయా - నీకే నీకే స్తుతి స్తోత్రం (2)
| ఆత్మతో I
2. దావీదు వలే నిన్ను ఆరాధింతును
ధవళవర్ణుడా ఆరాధింతును (2)
దేవదూత వలె ఆరాధింతును
దహించు అగ్ని నిన్నే ఆరాధింతును (2)
హల్లే హల్లే హల్లేలుయా - నీకే నీకే స్తుతి స్తోత్రం (2)
l ఆత్మతో I
3. కృపామయుడా నిన్నే ఆరాధింతును
నీ కృపలో నిలచి ఆరాధింతును (2)
సజీవుడా నిన్నే ఆరాధింతును
నా సర్వం నీకే అర్పింతును (2)
హల్లే హల్లే హల్లేలుయా - నీకే నీకే స్తుతి స్తోత్రం (2)
l ఆత్మతో I
0 Comments