హ్యాపీ క్రిస్మస్ మేర్రి క్రిస్మస్
ఆకాశాన తార వెలిసింది
అందరికీ ఆనందం తెచ్చింది
వింతైన తారకనిపించింది
కళ్ళల్లో కాంతులు నింపింది (2)
మనసు పులకరించే - హృదయం ఆనందించే
పాదాలు పరుగెత్తె పాకలోకి (2)
విష్యూ ఏ హ్యాపి క్రిస్మస్
విష్యూ ఏ మేర్రి క్రిస్మస్ (2)
1. బంగారు వీధుల్లో శ్రీమంతుడైనవాడు
భూలోకంలోనా పుట్టినాడు.
వెలుగునే వస్త్రముగ ధరించినవాడు
ఇలలోన మనకొరకై పుట్టెను (2)
దూతలతో చేరి గొల్లలతో చూచి జ్ఞానులతో ఆరాధించెదం (2)
ఆడి మేము పాడి పూజించెదం కొనియాడి స్తుతించి కీర్తించేదం (2)
మనసు పులకరించే - హృదయం ఆనందించే
పాదాలు పరుగెత్తె పాకలోకి (2)
విష్యూ ఏ హ్యాపి క్రిస్మస్
విష్యూ ఏ మేర్రి క్రిస్మస్ (2)
2. సింహసనం పైన ఆసీనుడైనవాడు
సింహసనం విడిచి ఇలకొచ్చెను
అమరత్వమందు నివసించువాడు
అందరి బందువై జన్మించెను (2)
గొర్రెల మేము విడిచి పోలమును మేము మరచి
శాలలోకి పరుగెత్తెదం (2)
చేరి మేము చూచి కీర్తించేదం మనసార మైమరచి పూజించెదం (2)
మనసు పులకరించే - హృదయం ఆనందించే
పాదాలు పరుగెత్తె పాకలోకి (2)
విష్యూ ఏ హ్యాపి క్రిస్మస్
విష్యూ ఏ మేర్రి క్రిస్మస్ (2)
హ్యాపీ క్రిస్మస్ మేర్రి క్రిస్మస్
3. బేత్లహేమునందు ఆ పశుశాలను
బలవంతుడు బాలుడై పుట్టెను
తండ్రి చిత్తము నిల నేరవేర్చుటాకై తనయుడై తగ్గించుకోని వచ్చేను (2)
బంగారం మేమిచ్చి సాంబ్రిని మేమిచ్చి భోళముతో
పూజింతుము (2)
ఇమ్మానుయేలని స్తుతింతుము ఇలలో మేమంత చాటింతుము (2)
మనసు పులకరించే - హృదయం ఆనందించే
పాదాలు పరుగెత్తె పాకలోకి (2)
విష్యూ ఏ హ్యాపి క్రిస్మస్
విష్యూ ఏ మేర్రి క్రిస్మస్ (2)
. ( ఆకాశాన )

0 Comments